Saturday, May 4, 2024

NZB: సీఎం బ్రేక్ ఫాస్ట్ ను ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 6 (ప్రభ న్యూస్) : సర్కారు బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని శుక్రవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్, జెడ్పి ఛైర్మన్, ఎమ్మెల్యే, నగర మేయర్ తదితరులు సైతం చిన్నారులతో కలిసి సహపంక్తిలో కూర్చుని అల్పాహారం తిన్నారు. విద్యార్థుల కోసం వండిన పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాల పని దినాల్లో ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించాలని, శుచి శుభ్రత పాటించాలని నిర్వాహకులకు సూచించారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రతిరోజూ క్రమం తప్పకుండా బడికి వస్తూ చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో తొలి విడతగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలులోకి తేవడం జరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా 1250 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వారంలో ఆరు రోజుల పాటు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. రుచికరమైన, నాణ్యతతో కూడిన, పోషక విలువలు కలిగిన బ్రేక్ ఫాస్ట్ విద్యార్థులకు అందించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement