Sunday, April 28, 2024

NZB: గుండెపోటుతో పాల్దా గ్రామ మాజీ సర్పంచ్ సుప్రియ మృతి

నిజామాబాద్ మండలంలోని పాల్దా గ్రామ తాజా మాజీ సర్పంచ్ సుప్రియ గుండెపోటుతో మరణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా పచ్చదనం, పరిశుభ్రతతో పాటు నిర్మించిన వైకుంఠ ధామం, పల్లెప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్డు ఆదర్శంగా నిలిచేలా సర్పంచ్ సుప్రియ నవీన్ గ్రామస్థుల సహకారంతో చేసిన సమిష్టి కృషి సత్ఫ లితమిచ్చింది.

దీంతో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా మూడవ స్థానం దక్కడంతో పాల్దా గ్రామ పేరు ప్రతిష్టతలు మరింతగా ఇనుమడింప జేయడంలో సర్పంచ్ పనితీరు పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి రెండేళ్ల క్రితం. ఈ నేపథ్యంలో సుప్రియ అకాల మరణం పొందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement