Thursday, May 2, 2024

NZB: మాది సెక్యులర్ పార్టీ.. షబ్బీర్ అలీ..

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 1 (ప్రభ న్యూస్): తమది సెక్యులర్ పార్టీ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. దొర పాలనపై తెలంగాణ ప్రజలు విసికి వేజారి మార్పు కోరారని.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటేశారని పేర్కొ న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారికి సహకరించిన వారందరికీ షబ్బీర్ అలీ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్ లో గల మాజీ మంత్రి షబ్బీర్ అలీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షబ్బీర్ హలీ మాట్లాడుతూ… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కే ప్రజలు ఈసారి పట్టం కట్టబోతున్నార్నారు. ఎగ్జిట్ పోల్స్ సరళీ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజారిటీ వస్తుందని చెబుతున్నాయి.. 25 సీట్లకంటే ఎక్కువ బీఆర్ఎస్ కు రావు.. ఇదే విషయాన్ని, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పారని తెలిపారు.

తెలంగాణలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉందని…. కానీ బీఆర్ఎస్ పగటి కలలు కంటుందని ఎద్దేవా చేశారు. దీపం ఆరిపోయే ముందు వెలిగినట్టు ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని కేటీఅర్ అంటున్నారు.. కేసీఆర్ నిన్న మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ లో మెజారిటీ కాంగ్రెస్ కు కనివినీ ఎరుగని రీతిలో వస్తదన్నారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. నాకు…మెజారిటీ.. మైనారిటీ అనే ఫీలింగ్ లేదు.. మనమంతా ఇండియన్స్ అని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హాందాన్, ప్రధాన కార్యదర్శి నరాల రత్నాకర్, నగర అధ్యక్షులు కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు భక్తవత్సలం, అదే ప్రవీణ్, కైసర్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement