Tuesday, June 18, 2024

చెరుకు సాగుకు రెడీగా రైతులు.. ఫ్యాక్టరీని తెరిపించండి..

నిజామాబాద్‌, (ప్రభ న్యూస్‌) : జిల్లాలో రైతులు చెరుకును పండించడానికి సిద్ధంగా ఉన్నందున సారంగపూర్‌ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించి నడిపించాలని, లేదా 95 యాక్ట ద్వారా రైతులే నడిపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్‌ ఆకుల పాపయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బిగెస్ట్‌ హౌస్‌లో చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో.. నిన్న‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా వరి పంట వద్దంటూ, ఆరుతడి పంటలే వేసుకోవాలి పంట మార్పిడి చేయాలని గ్రామాల్లో విస్తత ప్రచారం చేస్తున్నారని అన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో రైతులు ఆరుతడి పంట అయిన చెరుకుని పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని, సారంగపూర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తే అనేక వేల మందికి ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారని కానీ ఏడున్నర సంవత్సరాలు పూర్తయిన గాని ఫ్యాక్టరీని పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలో ఎన్నికైన ఎమెల్సీ కవిత చొరవ చూపి సారంగపూర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తి దారుల సంఘము నాయకులు సిర్పూర్‌ గంగారెడ్డి. నాయక్వాడ్‌ నర్సయ్య, వేల్పూర్‌ భూమయ్య, సాయి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement