Friday, May 17, 2024

Nizamabad | ఇందూర్‌‌కు అయోధ్య అక్షింతలు.. రేపటి నుంచి ఇంటింటికి

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : అయోధ్య పూజిత అక్షింతలు ఇందూర్‌‌కు రావడం నగర ప్రజల అదృష్టమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాదు నగరంలోని దేవిరోడ్డు హనుమాన్ మందిరం నుంచి అయోధ్య పూజిత అక్షిం తలు వచ్చిన సందర్బంగా నిర్వహిం చిన శోభాయాత్రలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కలశ పూజ నిర్వహించి శోభా యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలనుండి అయోధ్య రామ మందిరం కోసం ఎదురు చూస్తున్నామని త్వరలోనే మనం దర్శించుకోనున్నామన్నారు. ఈ సందర్బంగా అక్కడ నుంచి అక్షింతలు రావడం జరిగింది.. అక్షింతలు పుర విధుల్ల గుండా రేపటి నుంచి ప్రతి ఇంటికి అక్షింతలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

భారత దేశ చరిత్ర లోనే అయోధ్య మందిరం నిర్మాణం ఏర్పాటు కాబోతుందన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్, rss సార్ సంఘ చాలాక్ మోహన్ జి భగవత్ ఆలయ పున: ప్రతిష్ట కార్య క్రమం ప్రారంభమవుతుంద న్నారు మన చిరకాల వాంఛ నేరబోతుందన్నారు. ఈ శోభయాత్ర లో పెద్ద ఎత్తున నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో VHP అధ్యక్షులు దినేష్ ఠాకూర్, దత్రిక రమేష్, రోషన్ లాల్, పవన్ ముందర, తారక్ వేణు, వనిత సురేష్, మల్లేష్ గౌడ్, విక్రమ్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement