Tuesday, April 16, 2024

NZB: రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి… రాష్ట్ర రెడ్డి సంఘం

బిక్కనూర్, సెప్టెంబర్ 11, ప్రభ న్యూస్…. పేద రెడ్డిల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామంలో రెడ్డి కార్పొరేషన్ కోసం గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన లేఖను రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు రెడ్డి కులస్తులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయాలని తెలిపారు.

తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని సూచించారు. ఇందుకోసం గ్రామ గ్రామాన రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానాలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ తీర్మాన పత్రాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ అధ్యక్షులు నాగర్తి చంద్రారెడ్డి, మండల రెడ్డి సంఘం అధ్యక్షులు నాగన్న గారి నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు కందడి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, కోశాధికారి లింగారెడ్డి, ప్రతినిధులు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement