Sunday, June 16, 2024

Nizamabad : రేపు జిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి.. శ్రీసుధ రాక

నిజామాబాద్ సిటీ, జూన్ (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మిస్ట్రేటివ్ జడ్జి శ్రీసుధ జిల్లాకు రానున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సమావేశపు హల్ లో జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయాధికారులతో సమావేశమై న్యాయస్థానాలలో సివిల్,క్రిమినల్ కేసుల వివరాలు, న్యాయ విచారణ తీరుతెన్నులు సమీక్షీస్తా రు.న్యాయాధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తారు.అనంతరం న్యాయసేవ సదన్ లో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న”పోస్టల్ భీమా పథకాలు”అనే అంశంపై జరుగనున్న సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేసి సర్టిఫికెట్లనుప్రధానం చేస్తారు..సదస్సులో అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల, సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,ఇంచార్జీ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చాందక్,పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ మదన్ మోహన్ ఖాంది తదితరులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement