Monday, June 17, 2024

TS | బీఆర్‌ఎస్‌కి వరుస షాక్‌లు.. కాంగ్రెస్ లో చేరిన నందకిషోర్ వ్యాస్

బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయ. బీఆర్‌ఎస్ గోషామహాల్ బీఆర్‌ఎస్ ఇంఛార్జ్ నందకిషోర్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపించారు.

గోషామహల్ నుంచి ప‌లుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. గతంలో 2014లో స్వతంత్ర అభ్యర్థిగా, 2023లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు. రెండు సార్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. గోషామహల్‌లో హస్తం పార్టీని పూర్వవైభవం తీసుకోచ్చాన‌ని నందకిషోర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement