Sunday, February 25, 2024

NLG: మోత్కూర్ కు 30పడకల ఆస్పత్రి.. సీఎం, మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం

మోత్కూర్, సెప్టెంబర్ 30 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తుంగతుర్తి ఆశీర్వాద సభలో మంజూరు ప్రకటన చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటాలకు పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు. మోత్కూర్, అడ్డగూడూర్, గుండాల, ఆత్మకూరు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేగా రెడ్డి, నార్ముల్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనరసింహ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండ సోoమల్లు, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, కౌన్సిలర్ గుర్రం కవిత లక్ష్మి నరసింహారెడ్డి, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు జంగ శ్రీను, దబ్బేటి శైలజ, గ్రంథాలయ చైర్మన్ కోమటి మచ్చగిరి, మాజీ సర్పంచ్ కడమంచి వస్తాద్, నాయకులు మర్రి అనిల్ కుమార్, కందుల విక్రాంత్, ఎండి మజీద్, రఘుపతి, మొరిగాల శ్రీను, కట్ట ఇంద్ర జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement