Sunday, April 28, 2024

MBNR: ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి .. మంత్రి శ్రీనివాస్ గౌడ్

హన్వాడ, నవంబర్ 13 (ప్రభ న్యూస్) : ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఎంతో సంతోషంగా ఉన్నా కూడా తన ప్రజలను బాగు చేసుకోవాలని, వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ను ఎంతో అభివృద్ధి చేసుకున్నామని… రాబోయే ఐదేళ్లు మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసుకుందామని పేర్కొన్నారు. హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అయిన కేసీఆర్ భరోసా ద్వారా ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పెద్ద దర్పల్లి చెరువు నుండి భూములన్నిటికీ సాగునీటిని అందిస్తామన్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే ప్రతిపక్ష నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా… నాలుగో వంతు కూడా పనిచేయలేకపోయా…

  • మాజీ మంత్రి పి చంద్రశేఖర్
    తాను మహబూబ్ నగర్ లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కూడా గత పదేళ్లలో శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధిలో నాలుగో వంతు కూడా చేయలేకపోయినట్లు మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ తెలిపారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇంతటి అభివృద్ధిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హన్వాడ మండలం పెద్ద దర్పల్లిలో ఎన్నికల ప్రచార సభ వద్ద… హన్వాడ మండలానికి చెందిన ఎం శ్రీశైలం, కే మురారి, రాఘవేందర్, ఎండి బురాన్, కే తిరుపతయ్య, తదితరులు సర్పంచ్ రేవతి సత్యం ఆధ్వర్యంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -
  • హన్వాడ మండలం పల్లెమోని కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికి వెళ్లి చేసిన అభివృద్ధిని వివరించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అయినా కేసీఆర్ భరోసా ద్వారా ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేస్తామని మేనిఫెస్టో బ్రోచర్ ను అందించారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు మంత్రిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజ్, సింగల్ బండ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, ఎంపీటీసీ వడ్ల శేఖర్, కొండ బాలయ్య, కొండా లక్ష్మయ్య, జంబులయ్య, సర్పంచ్ వెంకన్న, వెంకటమ్మ, ఉపసర్పంచ్ గిరిజా ప్రవీణ్, మాజీ ఎంపీపీ కృష్ణయ్య గౌడ్, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement