Sunday, May 26, 2024

TS: రేపు కాంగ్రెస్ “నిరశన దీక్ష” – పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో 10ఏళ్లు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై రేపు కాంగ్రెస్ “నిరశన దీక్ష” నిర్వహించనున్నట్లు డీసీసీ ప్రకటన విడుదల చేసింది.

ఈ దీక్ష కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు పురుమల్ల శ్రీనివాస్, కె కె మహేందర్ రెడ్డి, ప్రణవ్ బాబుతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని మండలాల బ్లాక్, మండల, పట్టణ, కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల, విభాగాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొననున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement