Friday, May 3, 2024

ADB: ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

చెన్నూర్, ఆంధ్రప్రభ: శనివారం పలు ప్రారంభ కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చెన్నూర్ ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విప్ బాల్క సుమన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అట్టెం మధున్నయ్య, వివిధ పత్రికల విలేఖర్లు, మీడియా విలేఖర్లు పాల్గొన్నారు.

గులాబీ మయంగా చెన్నూర్..

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విప్ బాల్క సుమన్ అధ్వర్యంలో శనివారం మంత్రి హరీష్ నిర్వహించిన రోడ్ షోకు గ్రామీణ ప్రాంత ప్రజలు భారీగా తరలి రావడంతో గులాబీ మయంగా మారింది. నియోజక వర్గ కేంద్రంలో నూతనగా నిర్వహించిన 50పడకల ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంబించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి హరీష్ రావు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement