Saturday, July 27, 2024

బిసి గ‌ర్జ‌న పోస్టర్ ను విడుద‌ల చేసిన మంత్రి గంగుల

క‌రీంన‌గ‌ర్ – 10వ తేదీన హైదరాబాదులోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే బీసీల సింహ గర్జన పోస్టర్ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఆవిష్క‌రించారు. ఈ సింహగర్జనను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సంద‌ర్భంగా మంత్రి పిలుపు ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి దుగ్గలి శ్రీధర్ ,బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గాజె రమేష్, మహిళా అధ్యక్షురాలు అరుణ, జిఎస్ ఆనంద్, రమేష్ గౌడ్, మంద వెంకన్న మురళి, ప్రశాంత్, సతీష్, గాజె ప్రజోత్, తిరుపతి, జ్యోతి తదితరు పాల్గొన్నారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement