Tuesday, December 5, 2023

20 ఏళ్ల క‌ల నెర‌వేరింది.. ఖ‌మ్మంలో 88 మందికి ఇంటి ప‌ట్టాలు అందించిన మంత్రి అజ‌య్‌

ఖమ్మం సిటీ : మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ప‌థ‌కాలు ప్రతి నిరుపేద‌కు అందించామ‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఖ‌మ్మం జిల్లాలో ఆయ‌న ఇవ్వాల మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని 20వ డివిజన్ రామచంద్రయ్య న‌గర్ లో ఏళ్ల‌ క్రితం ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వేసుకున్న 88మంది పేదలకు శాశ్వత ఇళ్ల‌ పట్టాలను మంత్రి పంపిణి చేశారు. గూడు లేని వారు ఎన్నోఏండ్ల నుండి అభద్రతా భావంతో ఉంటున్నార‌ని, ఇవ్వాల రామచంద్రయ్య నగర్ నిర్వాసితుల కల నెరవేరిందన్నారు. ఇక్కడ నివసిస్తున్న పేదలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసే అవకాశం త‌న‌కు కలగడం సంతోషంగా ఉందన్నారు.

20ఏళ్ల‌ క్రితం త‌న సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ చొరవతో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న పేదలకు త‌న చేతుల మీదగా తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుందని ఊహించలేదన్నారు. పేదవాళ్లు ఎన్నో ఏళ్లుగా ఏ హక్కు లేకుండా జీవించడం కొంత బాధ కలిగించిందని అన్నారు. తాను మంత్రిగా ఉండటం వల్లే ఇప్పుడు దాదాపు 2వేలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగామన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం నగరంలో గుడిసెలు వేసుకుని నివాసముండి పట్టాలు లేని పేదవాళ్లు సొంత ఇల్లు లేకుండా ఉండటానికి వీలు లేదని మంత్రి పువ్వాడ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement