Thursday, October 31, 2024

MIM vs BRS – అస‌దుద్దీన్ ఓవైసీ షేక్”హ్యాండ్” …..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీల మధ్య పొత్తులు లేదా స్నేహపూర్వక పోటీలు ఉండవని తేలిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎఐఎంఐఎం) కసరత్తు చేస్తోం ది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశాలు కూ డా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో శాసన సభకు పోటీ చేయాలని నిర్ణయించింది. సోమవారం నిజామా బాద్‌ పర్యటన సందర్భంగా మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అస దుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. మూడోసారి గెలిచి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దషాక్‌ అని చెప్పవచ్చు. అసద్‌ చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌తో కలిసే పోటీ చేసే అవకా శాలు లేవని తేల్చాయి. బోధన్‌లో తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టి సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ను ఓడిస్తామని శపథం చేశారు. స్థానిక అంశాలతోపాటు రాష్ట్ర, జాతీయ రాజ కీయాలు, రాష్ట్రంలో పోటీచేసే స్థానాల విషయం కూడా అసద్‌ ప్రస్తావించారు. అంతేగాక సీఎం కేసీఆర్‌పై స్వరం పెంచి మాట్లాడడం విశేషం. గతంలో ఎన్నడూ కూడా బీఆర్‌ఎస్‌ లేదా సీఎం కేసీఆర్‌పై అసదుద్దీన్‌ ఒవైసీ ఇంత సీరియస్‌గా విమ ర్శలు చేయలేదు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర, కర్నా టక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పులు మొదలయ్యాయి.

కాంగ్రెస్‌లో నూతనోత్తేజం
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పనైపోయిందని అనుకుం టున్న తరుణంలో రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర జాతీ య రాజకీయాల్లో పెనుమార్పులకు దోహదం చేసింది. ఆ క్రమంలోనే పాట్నాలో 17పార్టీలతో నిర్వహించిన విపక్ష పార్టీల సమావేశం విజయవంతమైంది. కర్నాటక విజయోత్సా హంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అదే జోరు తెలంగాణలో కూడా కొనసాగిస్తోంది. కర్నాటక ఫార్ములానూ ఇక్కడ అమలు చేసి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కర్నా టక ఎన్నికలకు ముందు తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. కర్నాటక గెలుపు తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని తెప్పించింది. కాంగ్రెస్‌లో చేరికల జోరు పెరిగింది. ఈ నేప థ్యంలో గత కొంత కాలంగా అధికార బీఆర్‌ఎస్‌తో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న మజ్లిస్‌ పార్టీ కూడా అధికార బీఆర్‌ ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్‌పై సైతం విమర్శలను సంధిస్తోంది. ఫిిబ్రవరిలో జరిగిన అసెంబ్లిd బడ్జెట్‌ సమావేశాల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని శాసనసభకు వస్తామని సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా అసదుద్దీన్‌ కూడా రాష్ట్రంలో ప్రత్యా మ్నాయ పార్టీగా మజ్లిస్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. బోధన్‌లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే షకీల్‌ను ఓడి స్తామని కూడా ఛాలెంజ్‌ చేయడం బీఆర్‌ఎస్‌ పార్టీనే సవాల్‌ చేసినట్లుగా ఉంది.

బీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టేలా…
మజ్లిస్‌ పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాలు తప్ప మిగతా సెగ్మెంట్లలో మజ్లిస్‌ ఓట్లతో పాటు ముస్లిం మైనారిటీల ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కే పడేవి. మారిన రాజకీయ పరిస్థితుల్లో మజ్లిస్‌ దూరం కావడం ద్వారా బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బగా బీఆర్‌ఎస్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య అంతరం పెరగటానికి తాము కారణం కాదని బీఆర్‌ఎస్‌ చర్యలే తమను దూరం చేశాయని నేరాన్ని అధికార పార్టీవైపే నెట్టడం ద్వారా అసదుద్దీన్‌ బీఆర్‌ఎస్‌ను ఇరుకునబెట్టారు. అం దుకు కారణాలు కూడా చూపించారు. కేసీఆర్‌ కూతురు కల్వ కుంట్ల కవిత ఎంపీగా పోటీ చేసిన 2014, 2019 ఎన్నికల్లో కూ డా తమ కార్యకర్తలు ఆమె గెలుపుకోసం నిద్రాహారాలుమాని కృషి చేశారని, అలాంటి వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపారని అసద్‌ నిప్పులు చెరిగారు. దళిత బంధు మా దిరిగా ముస్లిం బంధు ఇవ్వటం లేదని, మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపులు ఘనంగా ఉంటున్నప్పటికీ నిధులు విడుదల చేయడం లేదని ఆరోపణలు చేశారు.

బీజేపీని ఓడించడమే లక్ష్యం
జాతీయ రాజకీయాలకు సంబంధించి 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఓడించడమే తమ లక్ష్యమని, ఆ పార్టీని ధీటుగా ఎదుర్కొనే పార్టీకే మద్దతు ఉంటుందని అస దుద్దీన్‌ ఒవైసీ ప్రకటించడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించినట్లయింది. పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి ఆహ్వానం రాలేదని, వస్తే వెళ్లేవారమని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్షాల కూటమిలో చేరేందుకు మజ్లిస్‌ పార్డీ మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలో మజ్లిస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయితే, కాంగ్రెస్‌కు మజ్లిస్‌ ఎందుకు దూరమైందో ఇంత వరకు బయటకు రాలేదు. ఆ విషయాన్ని అసద్‌ బయటపెట్టారు. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్లే కాంగ్రెస్‌ పార్టీకి దూరమయ్యామని కూడా అసదుద్దీన్‌ గతాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌తో శతృవైఖరి అవ సరం లేదని అసద్‌ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తమ పార్టీ దూరమని చెప్పడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు మజ్లిస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement