Monday, April 15, 2024

TS : ఇవాళ మేడారం హుండీ లెక్కింపు

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతర శనివారం (24వ తేది) ముగిసింది. ఈ నేప‌థ్యంలో మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండ టీటీడీ కళ్యాణమండపంలో ప్రారంభం కానుంది. మొత్తం 512 హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నారు.

ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగనుంది. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్రితం మేడారం నుంచి హుండీలను హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి అధికారులు తరలించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement