Monday, April 29, 2024

TS: త్యాగాల పునాది మీద తెలంగాణ సాధించుకున్నాం.. హరీశ్ రావు

బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే
కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ లీకులతో నడుస్తుంది
10ఏళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

దౌల్తాబాద్ (ప్రభ న్యూస్): ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ది చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.. దౌల్తాబాద్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డిలతో కలిసి మాట్లాడారు.. 10ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నల్ల ధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారన్నారు. పేదలకు చేసిందేమీ లేదని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందనన్నారు. మాయ మాటల రఘునందన్ గురించి దుబ్బాక ప్రజలకు తెలుసన్నారు. 6 గ్యారంటీల పేరున అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఏమైందన్నారు..నేను వొచ్చేటప్పుడు మిరుదొడ్డిలో మహిళా రైతులతో మాట్లాడానని, వొడ్లు ఎవరూ కొనడం లేదని వాపోయార‌న్నారు. మహాలక్ష్మి ద్వారా రూ.2500, నిరుద్యోగ భృతి కూడా మోసం చేశారన్నారు.. జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గా పనిచేసిన పి.వెంకట్రామరెడ్డి మీకు సుపరిచితుడేనని, ఇక్కడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు. గతంలో దుబ్బాకలో అనాధలు రాధా రాధికలకు అండగా ఉండి, విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లి కూడా చేసిన మనసున్న వ్యక్తి అన్నారు.. ట్రస్టు ద్వారా సేవ చేయడానికి వొచ్చిన ఆయనకు అండగా నిలవాలన్నారు.

ఉద్యమాల గడ్డ దుబ్బాక
పార్లమెంటు ఎన్నికల్లో దుబ్బాక సత్తా చాటాలి
మాయ మాటల రఘునందన్ కు బుద్ది చెప్పాలి
100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ఉద్యమాల గడ్డ దుబ్బాకలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఘన విజయం అందిద్దామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. దుబ్బాక అంటే మొదటి నుండి ఉద్యమ నాయకులు కేసీఆర్, హరీశ్ రావుల అడుగులో అడుగై ముందుకు సాగడం జరిగిందన్నారు.. సిద్దిపేట జిల్లాలోనే కేసీఆర్, హరీశ్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మెదక్ ఉప ఎన్నికలు మనకు అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు.. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధికి ఆదరణ కరువైందని, బీజేపీ అభ్యర్థికి ఆపార్టీ వాళ్లే ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు..మాయ మాటలు చెప్పే రఘునందన్ ను రెండు సార్లు చిత్తు చిత్తుగా ఓడించడం జరిగిందన్నారు.. బూటకపు హామీలు చెప్పి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు..యువతకు అండగా ఉంటామన్నారు..

- Advertisement -

ఎడ్లు, నాగలి ఇస్తామని మోసం చెయ్యలే
మాట తప్పెటోన్ని కాదు…
ప్రభాకరన్నతో కలిసి జోడెడ్లలా పనిచేస్తాం
మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి
ఎడ్లు బండి ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని డోఖా చెయ్యలేదని, గెలిచిన నెలరోజుల్లో రూ.100కోట్ల తో ట్రస్టు ఏర్పాటు చేసి అండగా ఉంటానని మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి హామీ ఇచ్చారు. దుబ్బాక గడ్డ అంటే ఉద్యమాల గడ్డ అని, ఇక్కడ నరనరాన తెలంగాణ రక్తం ఉరుకలెత్తుతుందన్నారు.. ఆశీర్వదిస్తే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో కలిసి దుబ్బాక అభివృద్ధికి జోడెడ్లలా పనిచేస్తానన్నారు.. సిద్దిపేట, గజ్వెల్ తరహాలో దుబ్బాకను అభివృద్ధిలో ధీటుగా మలుస్తామన్నారు. రెండు మార్లు ఎంపీగా, ఒక సారి ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం అందించిన దుబ్బాక ఓటర్లు తనకు సైతం ఆశీస్సులు అందించాలన్నారు.. ఏడున్నర ఏళ్ళు జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గా మీలో ఒకడిగా పనిచేశానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, నాటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల సహకారంతో దేశంలోనే సిద్దిపేట జిల్లాను టాప్ 10లో నిలపడం జరిగిందన్నారు.. ట్రస్టు ద్వారా దుబ్బాక యువతకు కోచింగ్, వృత్తి నైపుణ్య శిక్షణ అందించి జాబ్ మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి నిలువ నీడనవుతానన్నారు.. ఒక ఉద్యోగిగా కుటుంబానికి ఉద్యోగ అవసరం ఎలా ఉంటుందో తెలుసన్నారు.. నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు, నిరుపేదలకు కేవలం ఒక్క రూపాయితో సేవలు అందిస్తామన్నారు.. ఇంటింటికి ఒక కేసీఆర్ లా పనిచేసి ఘనవిజయం అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, మనోహర్ రావు, కత్తి కార్తీక గౌడ్, యూత్ నాయకులు సురేష్ గౌడ్, శేఖర్ గౌడ్, ఖలీల్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement