Tuesday, May 14, 2024

MDK: ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా హరీష్ వర్ధన్…

నర్సాపూర్, ఆగస్టు 10 (ప్రభ న్యూస్) : ఎన్ఎస్ యూఐ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా హరీష్ వర్ధన్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆదేశాలు జారీ చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఎన్ఎస్ యూఐ జిల్లా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని హరీష్ వర్ధన్ పేర్కొన్నారు. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన ఎన్ఎస్ యూఐ మెదక్ జిల్లా అధ్యక్షుడు హరీష్ వర్ధన్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అభినందించారు. అనంతరం నర్సాపూర్ లోని ఆయన క్యాంప్ ఆఫీసులో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, పీసీసీ మైనారిటీ సెల్ కార్యదర్శి హకీమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రియాజ్ అలీ, దన్ సింగ్, నర్సింహులు, అల్తఫ్, సోఫీ, చక్రి, పుల్ సింగ్, శంకర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement