Wednesday, June 19, 2024

MDK: చెరువులో గల్లంతైన బాలుడు మృతదేహం లభ్యం

మెదక్ జిల్లాలోని రంగాయిపల్లి గ్రామంలోని ఊర చెరువులో సోమవారం నీట మునిగిన బాలుడు ఇవాళ ఉదయం శవమై తేలాడు. ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోనాల పండగ కోసం అంబర్పేట్ గ్రామం నుండి రంగాయిపల్లి పిరంగి చందయ్యా ఇంటికి వచ్చిన సమీప బంధువులు లక్ష్మి, బాలమణి, ఆమె కుమారుడు చరణ్ లు బోనాల సంబరాల్లో పాల్గొన్నారు. సోమవారం ఉదయం వీరితోపాటు చంద్రయ్య కూతురు లావణ్యలు కలిసి చెరువులోకి వెళ్ళి బట్టలు ఉతికేందుకు వెళ్లారు.

ఆసమయంలో చరణ్ (10) ఆడుకుంటూ చెరువులోకి జారాడు. దీంతో తల్లి బాలమణితో పాటు లక్ష్మి, లావణ్యలు బాలున్ని కాపాడేందుకు చెరువులోకి వెళ్లగా.. వారు సైతం చెరువులో పడి మృతిచెందారు. దీంతో పోలీసులు వచ్చి ఇతరుల సహాయంతో ముగ్గురు మహిళల మృతదేహలను వెలికితీశారు. చెరువులో గల్లంతైన బాలుడి మృతదేహం రాత్రి వరకు దొరకలేదు. ఇవాళ ఉదయం బాలుని శవం నీటిపై తేలడంతో బయటకు తీశారు. పోలీసులు పంచనామా నిర్వహించి తుప్రాన్ మార్చురీకి తరలించామని ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement