Sunday, May 19, 2024

ఎల్లమ్మ కుంటలో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయండి : నిజాంపేట్ బిజెపి డిమాండ్

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి నందు ఎల్లమ్మ కుంట 8.5 ఎకరాల్లో విస్తరించి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న‌ చెరువు ఎఫ్ టి ఎల్ నందు ఉన్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాల‌ని నిజాంపేట్ బిజెపి యూనిట్ డిమాండ్ చేసింది. ఇందులో వాకింగ్ ట్రాక్,ఫెన్సింగ్ వేయించి అభివృద్ధి చేయాలని ,కాలనీ ప్రజలతో కలిసి క్షేత్రస్థాయిలో చెరువులో అక్రమ నిర్మాణాలను పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కోరింది. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడటం కాకుండా మున్సిపల్ అధికారులు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతూ బిజెపి యూనిట్ నిరసన కార్యక్రమం నిర్వ‌హించింది.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ చెరువు శిఖాన్ని తగ్గించడానికి అధికార పార్టీ నేతలు ప్రయత్నించడమే కాకుండా చెరువు అభివృద్ధి పట్ల అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు మరియు మున్సిపల్ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదని అన్నారు. చెరువు ఎఫ్ టి ఎల్ ఆక్రమించుకొని (R15 to22) మల్ల o పేట రోడ్లో అక్రమ షెడ్లు వేసి కిరాయిలకిచ్చుకుంటున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాల పైన ఇరిగేషన్ అధికారులు సర్వే మార్కింగ్ చేసి ఎందుకు కూల్చి వేయ‌డం లేదని ప్ర‌శ్నించారు.

ఇప్పటికైనా ఎల్లమ్మ కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు తొలగించి ఫెన్సింగ్ వేసి రక్షించడమే కాకుండా చెరువు నందు మురికి నీరు కలవకుండా ఎల్లమ్మ కాలనీ నుంచి శ్రీ హోమ్స్ మీదుగా వార్రకుంట వరకు నాలాను ఏర్పాటు చేయాలన్నారు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఎర్పాటు చుట్టుపక్కల కాలనీలో ప్రజలకి ఉపయోగపడుతుందన్నారు., తక్షణమే మున్సిపల్ అధికారులు,BRS అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చెరువు సుందరీకరణ ,పరిరక్షణకు తగినన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, డాక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి ప్రసాద్, అరుణ్ రావు సీనియర్ నాయకులు ప్రసాద్ రాజు, కుమార్ గౌడ్, శేషారావు, కౌశిక్, మురళీకృష్ణ, చుట్టుపక్కల కాలనీలా ప్రజలు భారీస్థాయిలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement