Thursday, May 2, 2024

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య..

కౌడిపల్లి, ప్రభ న్యూస్ : ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రాజపేట గ్రామంలో సోమవారం రోజున చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే రాజుపేట గ్రామానికి చెందిన మంగలి హరి 20 గత కొంత కాలం నుండి అతని బాబాయ్ లక్ష్మణ్ కు బాచుపల్లి లో గలషాపులో వృత్తి పని చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. ఆదివారం రోజున మధ్యాహ్న సమయంలో తన స్వగ్రామమైన రాజపేటకు వచ్చాడు.

తల్లిదండ్రులు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించినప్పటికీ హరి సమాధానం ఇవ్వలేదు.. సోమవారం రోజు మూడు గంటల ప్రాంతంలో ఇంటి ముందున్న పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపూర్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement