Sunday, June 2, 2024

మ‌ణికొండ‌లో దొంగ‌ల బీభ‌త్సం

న‌గ‌రంలోని మ‌ణికొండ‌లో దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అల్కాపురి కాల‌నీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి శుక్ర‌వారం రాత్రి దొంగ‌లు చొర‌బ‌డ్డారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఇండ్ల తాళాలు ప‌గుల‌గొట్టి చోరీకి పాల్ప‌డ్డారు. రెండు నివాసాల్లో ఉన్న 50 తులాల బంగారం, రూ. 2 ల‌క్ష‌ల‌ను దోపిడీ దొంగ‌లు అప‌హ‌రించారు.
బాధిత కుటుంబాల ఫిర్యాదు మేర‌కు నార్సింగి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement