Thursday, April 25, 2024

రాష్ట్రంలో ఎగిరేది కాంగెస్ జెండానే – రేవంత్ రెడ్డి

నాగర్‌కర్నూల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తెలం గాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్‌రావుకు దళిత, గిరిజన, ఆదివాసీ వర్గాలంటే వ్యతి రేకమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాం గ్రెస్‌ పార్టీ, ప్రభుత్వాల హయాంలోనే ఆ వర్గాలకు పెద్ద దక్కుతుందని ఆయన తెలిపారు. పాలమూ రులోని 14 అసెంబ్లి సీట్లు గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా ఎగరేసే బాధ్యత తనదేనని ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో నిర్వహంచిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టే బాధ్యత తనదని పేర్కొన్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బలహనవర్గాలు కలిసి కట్టుగా పని చేసి కాంగ్రెస్‌ను గెలిపించుకుందామని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ దళితు లకు, గిరిజనులకు ఎన్నో పదవులు ఇచ్చిందని, ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ లీడర్‌గా భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రిగా బలరాం నాయక్‌కు, పంజాబ్‌ సీఎంగా దళితులకు అవకాశ మిచ్చిందని గుర్తుచేశారు. దళిత గిరిజనులపై కాలు పెట్టి తొక్కి ఆధిపత్యం చెలాయించాలని దొర లు చూస్తున్నారని, అనాడు నిజాం రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఈ పాలమూరు జిల్లాకు, నల్లమల్ల ప్రాంతానికి ఉందని పేర్కొన్నారు.

”పాలమూరు గడ్డ అంటేనే పేదోల అడ్డ. అటువంటి గడ్డ మీద పేదోళ్ల మీద దాడి చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ కూర్చోదు. 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ 8 వేల ఎకరాలకు సాగు నీరందించే మార్కండేయ ప్రాజెక్టు ను కట్టిస్తానని హామీ ఇచ్చిండు. 2019లో శిలాఫకం వేశారు. ఇంతవరకు అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు. నాలుగేళ్లయినా ఇక్కడ కడతామన్న ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. మాట తప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ అన్యా యాన్ని ప్రశ్నించడానికి నాగం జనార్దన్‌ రెడ్డి అక్కడి వెళ్లారు. ఆ సమయంలో దళితులు, గిరిజనలు అండగా నిలబడ్డారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళితే నాగం జనార్దన్‌ రెడ్డిపై కేసులు పెట్టారు. ఒక వేళ మీకు చేతనైతే ప్రాజెక్టు కట్టండి… లేకుంటే మేము సన్నాసులం అని ఒప్పుకోండి. చంద్రబాబు #హయాం లో పాలమూరు నుంచి 10 లక్షల మంది వలస వెళ్లారు. వలసలను నివారించడానికి పాలమూరను పచ్చగా చేయడానికి రూ.2 వేల కోట్లతో 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నాగం జనార్దన్‌ రెడ్డి మంజూరు చేయిం చారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాని సామర్థ్యాన్ని 5 లక్షల ఎకరాలకు పెంచింది. అనాడు పాలమూరు రైతుల కోసం కాంగ్రెస్‌ పార్టీ పాల మూరు- రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసింది. మీ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును ఎండబెట్టింది. జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా?. మేం కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఇక్కడి ఎమ్మెల్యే ఫొటోలు దిగుతున్నాడు. ప్రాజెక్టుల విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ వర్గీకరణ, ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తానని చెప్పిన సీఎం .. ఏమీ చేయలేదు. పైగా దళిత గిరిజనుల గొంతుపై కాలు పెట్టి తొక్కిస్తున్నాడు. మేమిచ్చిన తెలంగాణలో దళిత గిరిజనులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. దళిత గిరిజనులకు కాంగ్రెస్‌ అండగా నిలబడుతుంది. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బల#హనవర్గాలు కలిసికట్టుగా కాంగ్రెస్‌ను గెలిపించాలి” అని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దలిత, గిరిజనులపై దాడులు, అవమానాలు జరుగుతుంటే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement