Tuesday, October 8, 2024

TS: రైతన్నల ఆశీర్వాదం కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి సరితమ్మ ప్రచారం..

గద్వాల (ప్రతినిధి), నవంబర్ 15 (ప్రభ న్యూస్) : గద్వాల పట్టణంలోని కూరగాయల సంత బజారులో కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సరితమ్మ వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతన్నలను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం ఆరు గ్యారెంటీ పథకాలను మార్కెట్లో సంత బజారుకు వచ్చిన రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ వివరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రైతన్నల, ప్రజల కష్టాలు తొలగిపోతాయని మాట్లాడారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీదేవి, గంజిపేట్ శంకర్, మధుసూదన్ బాబు, డీటీడీసీ నరసింహులు, తుమ్మల నరసింహ, నాగేంద్ర యాదవ్, భాస్కర్ యదవ్, గంజిపేట్ తిమ్మన్న, కరాటే సత్యం, రాము యాదవ్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement