Monday, June 24, 2024

MBNR : ఎదిర గ్రామంలో పోలింగ్ బహిష్కరణ

మహబూబ్ నగర్, మే 13 (ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిర గ్రామంలో ప్రజలు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పటివరకు గ్రామస్థులు పోలింగ్ బూత్కు వెళ్లి ఒక్క ఓటు కూడా వెయ్య లేదు.

గత రెండు నెలల నుంచి గ్రామస్తులు అమర్ రాజా కంపెనీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించిన, అధికారులు స్పందించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించామని పలువురు పెద్దలు తెలిపారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement