Wednesday, May 1, 2024

RR | ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మ‌హ‌త్య‌!

జవహర్ నగర్ (ప్రభ న్యూస్): ప్రేమ విఫలమై మ‌న‌స్తాపంతో ఓ యువకుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్ నగర్ కాలనీలో జాహేదా బేగం కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. జహేదా కుమార్తె షకీరాబేగం చిన్నకుమారుడు షేక్ యాసిన్ టాటాఎస్ డ్రైవర్గా పనిచేస్తూ అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. కొంత కాలంగా షేక్ యాసిన్ (21) ఓ యువతితో ఫోన్ సంభాషణ చేస్తున్నాడు. కొన్ని రోజుల నుండి యాసిన్‌లో మార్పు వచ్చింది… ఇంట్లో ఎవరితో మాట్లాడడం లేదు.

పనులు ముగించుకొని ఈ నెల 24న ఇంటికి వచ్చిన యాసిన్ నిద్రపోయాడు. సోమవారం ఉదయం అత‌డిని నిద్రలేపటానికి తలుపులను తట్టడంతో ఎంతకు తీయ‌లేదు. దీంతో కిటికిలోంచి పరిశీలించగా యాసిన్ సీలింగ్ పైకప్పుకు తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో తలుపులు తెరచి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. యాసిన్ మ‌న‌స్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement