Friday, May 3, 2024

Lets Metro for CBN – చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లు… మియాపూర్ మెట్రో స్టేష‌న్ మూసివేత …

హైదరాబాద్ – టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణించాలని ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’ కార్య‌క్రమాన్నినిర్వ‌హించాల‌ని మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు భారీగా నిరసన కారులు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు సైతం పెద్ద ఎత్తున మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. టెక్నికల్ రీజన్ అని చెబుతూ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. మెట్రో అధికారులతో చంద్రబాబు మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు..

మరోవైపు నల్ల చొక్కాలు వేసుకుంటే అనుమతి లేదని మెట్రో సిబ్బంది మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారు. పొరపాటున నల్ల చొక్కాలు ధరించిన ప్రయాణికులు, మెట్రో సిబ్బందిని సైతం పోలీసులు అనుమతించడం లేదు. చంద్రబాబు మద్దతుదారులతో మెట్రో రైళ్లు, స్టేష‌న్ లు కిక్కిరిసిపోతున్నాయి. అమీర్‌పేట్, ఎంజీబీఎస్ దగ్గర మెట్రో రైళ్లను నిలిపివేశారు. ఈ ఆందోళనల నడుమ మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement