Sunday, April 28, 2024

TS : ఇవాళ ఢిల్లీకి కేటీఆర్…

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు కేటీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నారు.

- Advertisement -

క‌విత‌ కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది.ప్రస్తుతం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అవకాశం ఉంది. నేటి సాయంత్రం ఈ సమయంలో కవితను కేటీఆర్‌ కలవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement