Friday, March 1, 2024

Puvvada: రఘునాథపాలెం మండలానికి మహర్దశ.. రోడ్ల నిర్మాణానికి రూ.13.10కోట్ల మంజూరు

ఖమ్మం సిటీ : ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలానికి మహర్దశ పట్టింది. మండల ప్రజల విజ్ఞప్తి మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో వివిధ గ్రామాలను కలుపుతూ ఉన్న 6 మట్టి రోడ్లకు బ్లాక్ టాప్ రోడ్లు మంజూరు చేస్తూ రు.13.10 కోట్ల ఉత్తర్వులను ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు మంత్రి పువ్వాడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా రోడ్ల అవశ్యకతను వివరించి పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ రహదారుల నిర్మాణం ద్వారా నిధులు మంజూరు చేయించారు.


మంజూరైన పనులను త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అడిగిన వెంటనే రోడ్ల కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యర్థన మేరకు, మట్టి రోడ్లను BT రోడ్లుగా మార్చిన మంత్రి పువ్వాడకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


రఘునాథ పాలెం మండలంలో ఆరు కొత్త రోడ్లు మంజూరు అయిన రోడ్ల వివరాలు..

  1. రూ.2.40 కోట్లతో పంగిడి నుండి లచ్చిరాం తండా వరకు..
  2. రూ.2 కోట్లతో రాములు తండా నుండి కోర్లబొడు తండా X రోడ్ వరకు..
  3. రూ.1.70 కోట్లతో మంచుకొండ నుండి సుకిని తండా వరకు..
  4. రూ.1.50 కోట్లతో మంచుకొండ నుండి చిమ్మపుడి వరకు.. 5. రూ.3 కోట్లతో బూడిదంపాడు నుండి వాంకుడోత్ తండా వరకు..
  5. రూ .2.50 కోట్లతో పంగిడి నుండి కొర్ర తండా వరకు.. బ్లాక్ టాప్ రోడ్ల పనులకు ఉత్తర్వులు మంజూరు పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement