Sunday, May 19, 2024

TS | ఉచిత విద్యుత్‌పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

తెలంగాణలో ఉచిత విద్యుత్ పధకం అమలు చేసేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.క్షేత్ర స్ధాయిలో అర్హులను గుర్తించేందుకు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తాజాగా గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లు ప్రీ కరెంట్ పొందాలనుకునే వారికి సర్కారు కీలక సూచనలు చేసింది. వారు ఆధార్ కలిగి ఉన్నట్లు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందని లేకపోతే ఆధార్ అథెంటిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పెర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గృహజ్యోతి పథకం అమలుపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హామీ పథకాల్లో అత్యంత ప్రధానమైన గృహజ్యోతి యోజనను అమలు చేసింది. ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉండేవారికి ప్రయోజనం చేకూర్చేలా ఇంధన శాఖ గృహజ్యోతి పథకంలో మార్పులు చేసింది. అద్దె ఇళ్లలో ఉండేవారు.. మొదట ఓ ఇంటి పేరు మీద పథకం పొందుతూ.. కొన్ని నెలల తర్వాత, వారు వేరే ఇంటికి మారితే, అప్పుడు కూడా వారు ఈ పథకాన్ని పొందేలా మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఇల్లు మారిన వారు ఈ పథకాన్ని పొందాలంటే ఏం చేయాలనే ప్రశ్న ఉండేది.

ఈ గందరగోళానికి విద్యుత్ శాఖ తెరదించింది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాల‌కు గృహజ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ ప‌థ‌కం అమలుపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. గృహ జ్యోతి పథకం అమ‌లుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉచిత విద్యుత్ గృహ జ్యోతి పథకానికి బడ్జెట్ లో రూ.2,418 కోట్లు కేటాయించామన్నారు. విద్యుత్ సంస్థలు ట్రాన్స్ కో, డిస్కమ్ లకు రూ.16,825 కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. రైతుల‌కు 24 గంట‌ల నాణ్యమైన విద్యుత్‌ను అందించ‌డానికి త‌మ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని భ‌ట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement