Tuesday, May 28, 2024

TS : రేపు సంగారెడ్డిజిల్లాలో కేసీఆర్‌ పర్యటన… భారీ బహిరంగ సభ..

రేపు మాజీ సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా సుల్తాన్‌పూర్‌లోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.

- Advertisement -

దీంతో సుల్తాన్‌పూర్‌ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నది. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరుకానున్నారు. యువత, రైతులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేపడుతుంది.

కాగా.. ఈ నెల 16న మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ సభ నిర్వహించే సభ స్థలిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించామని, ⁠కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలు గుర్తు వచ్చేలా రైతులు, యువకులు, మహిళలు, గొల్ల కురుమలు రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలన్నారు హరీష్‌ రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement