Friday, May 3, 2024

రేపే కెసిఆర్ చేతుల మీదుగా అంబేద్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లు- వేగంగా సాగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ సర్కార్‌ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అంబేద్కర్‌ విగ్రహం దిగువన ప్రాంగణంలో తుదిదశ పనులు కొనసాగుతున్నాయి. తుది పనులు పూర్తి చేసి ఆ తర్వాత అలంకరణ పనులు చేపట్టనున్నారు. పక్కనే బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు- చేస్తున్నారు. మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, పలువురు ఉన్నతాధికారులు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాజధాని నగరంలో విగ్రహావిష్కరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 14న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న అఖిల భారత సర్వీస్‌ అధికారులందరినీ తెలంగాణ సర్కార్‌ ఆదేశించింది.

దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తయ్యింది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ నిర్మాణానికి ప్రత్యేకత సంతరించుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ టాంక్‌బండ్‌ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు- సీఎం 2016లో ప్రకటించారు. దానికి అనుగుణంగా 2016 ఏప్రిల్‌ 14న ఎన్టీఆర్‌ పార్కు పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ కూడా చేశారు. ఏడాది కాలంలో (2017 ఏప్రిల్‌ 14 నాటికి) నిర్మాణం పూర్తయ్యేలా టార్గెట్‌ ఫిక్స్‌ చేసి సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షించారు. 2017లో అప్పటి డిప్యూటీ- సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం చైనాలో పర్యటించింది. భారీ విగ్రహాలను పరిశీలించి డీపీఆర్‌ సమర్పించాల్సిం దిగా ఏరోసెల్‌ కంపెనీతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

విగ్రహం నమూనా కోసం డిప్యూటీ- సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్‌, బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, ఆరూరి రమేశ్‌తో కూడిన సబ్‌ కమిటీ- చైనాలో పర్యటించి కార్యరూపంలోకి తెచ్చింది. పార్లమెంటు- ఆకృతిలో నిర్మిస్తున్న బేస్‌మెంట్‌కు ఆగ్రా, నోయిడా, జైపూర్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ రంగుల రాళ్లను నిర్మాణ సంస్థ వాడుతున్నారు. విగ్రహంలోని బూట్లు-, కాళ్లు, చేతులు, భారత రాజ్యాంగం పుస్తకం, భుజాలు, ముందుకు చూపుతున్నట్లు- ఉండే కుడిచేయి, తల తదితరాలన్నిం టినీ విడివిడి భాగాలుగా నోయిడాలో కంచుతో తయారుచేసి లారీల ద్వారా తరలించారు. విగ్రహం పటిష్టంగా ఉండేందుకు లోపలివైపు స్టీల్‌ స్ట్రక్చర్‌ను వాడుతున్నారు. విడివిడి భాగాల మొత్తం అమరిక పూర్తయిన తర్వాత పాలీ యూరేథీన్‌ కెమికల్స్‌తో కోటింగ్‌ (పాలిషింగ్‌) చేయనున్నా రు. టాంక్‌బండ్‌ నీటి కాలుష్యంతో పాటు- గాలిలోని రసాయనాల, వాతావరణ మార్పులతో విగ్రహం షైనింగ్‌ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటు-న్నారు. అతి భారీ తుపానులను కూడా తట్టు-కునేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంబేద్కర్‌ జీవిత చరిత్రను ప్రతిబింబించేలా మ్యూజియంలో అంబేద్కర్‌ చిత్రపటాలే, రాజ్యాంగం తయారీ కోసం పడిన శ్రమను వివరించే ఫొటోలు ఉంటాయి.

విగ్ర‌హ ప్ర‌త్యేక‌త‌లు..
విగ్రహం ఎత్తు: 125 అడుగులు
వెడల్పు: 45 అడుగులు
బేస్‌మెంట్‌ ఎత్తు: 50 అడుగులు
లొకేషన్‌: టాంక్‌బండ్‌ ఎదురుగా ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కన
విస్తీర్ణం: మొత్తం 11.4 ఎకరాల స్థలంలో
వాడుతున్న స్టీల్‌: 155 టన్నులు
విగ్రహానికి వాడే కంచు: 111 టన్నులు
విగ్రహం ఔటర్‌ లేయర్‌కు: 9 టన్నుల కంచు
కోటింగ్‌: పాలీ యురేథీన్‌ పాలిషింగ్‌
మొత్తం వ్యయం: రూ.146 కోట్లు-
నిర్మాణ సంస్థ: కేపీసీ ప్రాజెక్టు ప్రై. లి.
డిజైనర్‌: పద్మభూషణ్‌ రాం వంజి సుతార్‌,
ఆయన కుమారుడు అనిల్‌ సుతార్‌
బేస్‌మెంట్‌లో ఏముంటాయి?: మ్యూజియం, లైబ్రరీ,
ఆడియో విజువల్‌ కాన్ఫరెన్సు హాల్‌
బేస్‌మెంట్‌ నమూనా: ఢిల్లీలోని పార్లమెంటు- ఆకృతిలో
లాంఛన ప్రారంభోత్సవం: ఏప్రిల్‌ 14, 2023
(అంబేద్కర్‌ జయంతి)
భూమి పూజ: 2016 ఏప్రిల్‌ 14న (అంబేద్కర్‌ జయంతి)
సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement