Wednesday, May 15, 2024

రెండు స్థానాల‌లో కెసిఆర్ పోటీ ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-పై సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో అయన ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంతో పాటు- మరో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా? దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక నియోజక వర్గం నుంచి పోటీ- చేయాలన్న నిర్ణయానికి వచ్చారా? అవుననే అంటు-న్నాయి భారాస ఉన్నత స్థాయి వర్గాలు.

అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల నుంచి బరిలోకి దిగాలన్న ప్రతిపాదనపై గత కొంత కాలంగా పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చోప చర్చలు జరుగు తున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతు న్నాయి. ఈ మేరకు భారాస చీఫ్‌ ప్రణాళిక కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు- ఆ వర్గాలు చెబుతున్నాయి. గజ్వేల్‌తో పాటు- మరో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీకి దిగాలా లేక కొత్తగా రెండు సెగ్మెంట్లను ఎంపిక చేసి అక్కడి నుంచి బరిలోకి బరిలో ఉండాలన్న అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట టు- గజ్వేల్‌
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2014, 2018) భారాస అధినేత కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ నుంచి పోటీ- చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేసీఆర్‌ సిద్దిపేట నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.

లోక్‌ సభకు కరీంనగర్‌, మహబూ బ్‌ నగర్‌ నుంచి పోటీ-కి దిగి కేంద్ర మంత్రిగా పని చేశారు. కాగా ఈ దఫా ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు- మహబూబ్‌ నగర్‌ అసెంబ్లీ నుంచి పోటీ-కి దిగాలన్న ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నారన్న ప్రచారం జరుగుతుండగా గజ్వేల్‌ను వదిలేసి నల్గొండ, మహబూబ్‌ నగర్‌ అసెంబ్లి నియోజకవర్గాల్లో అంటే రెండు స్థానాల్లో పోటీ-కి దిగినా ఆశ్చర్య పోనవసరం లేదని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దక్షిణ తెలంగాణలో భారాస బలహీనంగా ఉందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే విధంగా ప్రజల తీర్పును కోరి సత్తా చాటాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు- సమాచారం. గతంలో మహబూబ్‌ నగర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి కేసీఆర్‌ బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నియోజక వర్గం నుంచి పోటీ-కి దిగాలన్న ప్రతిపాదనపై ఇప్పటికే పలు దఫాలు సమాలోచనలు కూడా జరిగాయని భారాస కీలక నేత ఒకరు పేర్కొన్నారు.

- Advertisement -

అయితే గజ్వేల్‌తో పాటు- మహబూబ్‌ నగర్‌ బరిలో ఉండాలన్న నిర్ణయం జరిగినప్పటికీ తాజాగా గజ్వేల్‌, నల్గొండ అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలన్న ప్రతిపాదనపై చర్చలు మొదల య్యాయని సమాచారం. ఇటీ-వల గజ్వేల్‌ భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తన్నీరు హరీష్‌ రావు మాట్లాడుతూ ఈ దఫా ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు- మరో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ- చేసే అవకాశాలున్నాయని పరోక్షంగా చెప్పారు. అప్పటి నుంచి కేసీఆర్‌ స్థానంలో తామంటే తాము బరిలోకి దిగుతామని మీడియాకు లీకులు ఇస్తున్నారు. హరీష్‌ రావు ప్రకటనతో కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ-కి దిగుతున్నారన్న ప్రచారానికి బలం చేకూరునట్లయ్యింది.

నియోజకవర్గం మారే విషయంలో..
భారాస చీఫ్‌ కేసీఆర్‌ సీటు- మారే విషయంలో పార్టీలో ఒక వైపు చర్చ జరుగుతుండగా కేసీఆర్‌ ఒక నియోజకవర్గంలో పోటీ- చేస్తే దాని ప్రభావం చుట్టు-పక్కలుండే పాతిక, ముప్పై నియోజకవర్గాల మీద పడుతుందని, అందుకే పార్టీ కాస్త బలహీనంగా ఉండే చోట నుంచి ఆయన బరిలో దిగితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా హరీష్‌రావు చేసిన కామెంట్స్‌తో ఆ అభిప్రాయం నిజమే అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement