Wednesday, May 15, 2024

KNR: విజయ రమణారావుపై ఈడీకి ఫిర్యాదు చేస్తా.. మాజీ ఎమ్మెల్యే గోనె

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ రమణారావుపై ఈడీ, ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు స్పష్టం చేశారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… విజయ రమణారావు విదేశీ అకౌంట్లు, పలు కంపెనీల్లో పెట్టుబడులపై ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనన్నారు. ఐదు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి హోంశాఖతో పాటు ఈడీకి ఫిర్యాదు చేస్తానన్నారు. దేశంలోనే పేరున్న ఆడిటర్ తో విదేశీ ఖాతాలు, పెట్టుబడులపై ఆరా తీస్తామన్నారు.

2018లో 2023లో వేర్వేరు పాన్ కార్డు నెంబర్లు ఎందుకు ఇచ్చారన్నారు. విదేశాల్లో అకౌంట్లు తెరవాలంటే విమానం ఎక్కి పోవాల్సిన అవసరం లేదని ఆన్ లైన్ లో కూడా ఖాతాలు తెరుచు కోవచ్చన్నారు. సూట్ కేస్ కంపెనీల్లో పెట్టుబడులపై సంబంధిత అధికారులు విచారణ చేసి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. విజయ రమణారావు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని, విదేశీ ఖాతాలపై ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈడీ రాకముందే పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఫిర్యాదు చేసిన అనంతరం మరింత సమాచారం మీడియాకు తెలియజేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement