Monday, April 15, 2024

Peddapalli: ప్రతి గడపకు సంక్షేమ పథకాలు… చైర్ పర్సన్ మమతారెడ్డి

పెద్దపల్లి, (ప్రభ న్యూస్) : దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి తెలియజేశారు. శుక్రవారం పట్టణంలోని 25వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఇటీవల విద్యార్థులకు ప్రవేశపెట్టిన అల్పాహారం, తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం, సన్న బియ్యం, ఆసరా పెన్షన్ పెంపు, రైతు బంధు పెంపుతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ను పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, కారు గుర్తుకు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement