Sunday, May 5, 2024

Peddapalli: పదేళ్లలో ఎంతో చేశాం.. మరోసారి గెలిపిస్తే మరింత ప్రగతి.. ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్‌, నవంబర్‌ 15 (ప్రభన్యూస్‌): గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి ఆదరించి గెలిపిస్తే రానున్న ఐదేళ్లలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి గ్రామంలో గడపగడపకు ప్రచారంలో చేస్తూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా సీఎం కేసీఆర్‌ పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కేసీఆర్‌ కిట్టు, షాదీ ముబారక్‌, కళ్యాణ లక్ష్మి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం లాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేవన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు.

అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్న కాంగ్రెస్‌ పార్టీని నమ్మవద్దని, నమ్మి మొండి చేయికి ఓటు వేస్తే తిరిగి కష్టాలు మొదలవుతాయన్నారు. నియోజకవర్గంలో గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని గత తొమ్మిదిన్నరేళ్లలో 40ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపామన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయని కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దాసరికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.

ఈకార్యక్రమంలో జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్‌ పాల రామారావు, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మార్కెట్‌ ఛైర్మెన్‌ బుర్ర మౌనిక శ్రీనివాస్‌, రైతు సమితి మండల కో ఆర్డినేటర్‌ బోయిని రాజ మల్లయ్య, రైతు సమితి జిల్లా డైరెక్టర్‌ కాసర్ల అనంత రెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌ జూపల్లి సందీప్‌ రావు, కన్వీనర్‌లు శ్రీనివాస్‌ రెడ్డి, మైలారం నారాయణ, బీసీ అధ్యక్షులు గరిగంటి కుమార్‌ బాబు, సూర శ్యామ్‌, పడాల అజయ్‌, సర్పంచ్‌ మోరపెల్లి మోహన్‌ రెడ్డి, ఎంపీటీ-సీ అనిత అంజయ్య, తాళ్లపెల్లి మనోజ్‌ గౌడ్‌, మోరపెల్లి తిరుపతి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం ఎల్లయ్య, పచ్చిక ప్రవీణ్‌ రెడ్డి, ఉమ్మెంతల సంపత్‌ రెడ్డి, దాసరి అనిల్‌, ఎనమల్ల రాజేశ్వరి, వేయిగండ్ల భూమయ్య, మాతంగి రాజయ్య, కేతిరెడ్డి తిరుపతి రెడ్డి, కుడుదుల లచ్చయ్య, సంపత్‌, తిరుపతమ్మ, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement