Monday, April 29, 2024

Top Ranks – జిప్యాట్ లో శాతవాహన వ‌ర్శిటీ ఫార్మసీ విద్యార్థులకు ర్యాంకుల పంట‌…

క‌రీంన‌గ‌ర్ – అఖిల భారత స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జిప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసి ఆప్టిట్యూడ్ టెస్ట్) లో శాతవాహన విశ్వవిద్యాలయ ఫార్మసీకళాశాల విద్యార్థులు కళాశాల చరిత్రలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. శ్రీశైలం తెలిపారు. ఈ పరీక్షలో మొత్తం పదిహేడు మంది విద్యార్థులు కె సాయికిరణ్, యల్ శిరీష, డి ప్రీతి, యం అరవింద్, వై స్నేహ, ఎన్ స్వప్న, టి అఖిల, బి మేఘన, యం ఆకస్మిత, కె రాము, కె సుధారాణి, యం రవీంద్ర బాబు, ఇ మనీషా, ఏ లోకేష్, ఏ రమ్య, యల్ బిందు సాహితి మరియు జి బేబీ అర్హత సాధించినట్లు ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. మల్లేష్, రిజిస్ట్రార్ డా యం వరప్రసాద్ విద్యార్థులను అభినందిస్తూ విశ్వవిద్యాలయ కళాశాల చరిత్రలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణం అని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలోని కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులను అభినందించారు. జి.ప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు దేశంలోని నైపర్ వంటి అత్యుత్తమ సంస్థలలో యం.ఫార్మసీ కోర్సులో ప్రవేశం లభిస్తుందని మరియు కోర్సు వ్యవధిలో కేంద్రవిద్యా మంత్రిత్వ శాఖ నెలకు పన్నెండు వేల రూపాయల ఉపకారవేతనం చెల్లిస్తుందని అన్నారు. విద్యార్థులకు పి.హెచ్.డి. లో ఎంట్రన్స్ లేకుండా ప్రవేశం లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహాయ రిజిస్ట్రార్ వై.కిషోర్, ఫార్మసీ విభాగాధిపతి డా కె సునీత, అధ్యాపకులు డా బి భాగ్యలక్ష్మి, జి యల్ అర్చన, డా. సిహెచ్. అనిల్ కుమార్, డా కె తిరుపతి, డా శ్రీనివాస్ నాయక్, పి.క్రాంతి రాజుమరియు జె. అశ్విని పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్

- Advertisement -

కె సాయికిరణ్:
మాకు ర్యాంకు రావడం వెనుక అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో ఉంది. వారి సూచనలు ఎంతో ఉపయోగ పడ్డాయి. నైపర్ లో సీటు సాధించడమే నా లక్ష్యం

యల్ శిరీష:
ప్రణాళికా బద్దంగా చదవడం కలసి వచ్చింది. అధ్యాపకులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసేవారు. జాతీయ స్థాయి సంస్థ లో యం ఫార్మసీ చేసి పరిశోధన చేయాలని ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement