Sunday, May 19, 2024

విద్యార్థి ఆత్మహత్య.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..

పెద్దపల్లి ‌: తెలంగాణలో ప్రభుత్వ నియామకాలు చేపట్టడం లేదని, ఈ విషయం ప్రభుత్వానికి తెలిపాలనే ఉద్దేశంతో కాకతీయ యూనివర్సిటీలో మార్చి 26న పురుగులమందు ఆగి ఆత్మహత్యాయత్నం చేసి మరణించిన విద్యార్థి సునీల్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్‌ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2016లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగానికి క్వాలిఫై అయిన సునిల్‌ ఎత్తు సరిపోలేదని తప్పించారన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందని ఎదురు చూసి తీవ్ర మనస్తాపానికి గురై బాధతో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సునిల్‌ మరణించడం చాలా బాధాకరమన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు రాలేవని తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని, ఇప్పటి-కై-నా ప్రభత్వం కళ్లు తెరవాలన్నారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని, ఆత్మ హత్యల వల్ల ఉద్యోగాలు రావని, ప్రాణాలతో ఉండి సాధించుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement