Friday, May 17, 2024

Peddapalli: బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్.. ఎమ్మెల్యే దాసరి

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జాం పేట, కిష్టంపేట, మోట్లపల్లి, చిన్నరాతపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి మరోసారి రైతు, మహిళ, నిరుపేదల పక్షపాతి అని నిరూపణ అయిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు ద్వారా ప్రతి ఏటా ఎకరానికి 16వేల రూపాయలు అందిస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు.

మహిళలకు మూడు వేల రూపాయలు ప్రతినెలా అందిస్తామని, తెల్ల కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందించడంతో పాటు రైతు బీమా తరహాలో బీమా వర్తింప చేస్తామన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గ్రామాల్లో మీ ఇండ్ల ముందు మీ కళ్ళముందే కనబడుతుందనన్నారు. సీఎం కేసీఆర్ మాటలతో కాకుండా చేతలతో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నికల సీజన్లో వచ్చే నాయకులు ఎన్నికల తర్వాత కనబడరని, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం మీ కష్టసుఖాలలో వెన్నంటి ఉంటారన్నారు.

వారంటీ లేని 6 గ్యారంటీల పత్రాలతో వచ్చేవారిని నమ్మి మోసపోవద్దన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి అభివృద్ధి పథంలో నడిపించే మహానుభావుడు సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే మన కర్తవ్యం అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసి ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు. పలు పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్ర రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాసర్ల తిరుపతిరెడ్డి, సర్పంచులు పుప్పాల నాగర్జునరావు, గోనె శ్యామ్, దాసరి నవ లోక, ఎంపీటీసీ బొలమల్ల కౌసల్య, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, నాయకులు నిదానపురం దేవయ్య, దాసరి నరేందర్, దానవేన రవీందర్ యాదవ్, అన్నవేన సురేష్, నవీన్ యాదవ్, బొలమల్ల శంకర్, బొమ్మ శ్రీనివాస్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement