Tuesday, April 16, 2024

22న మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే దాసరి

నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈనెల 22న ఆదివారం పట్టణంలోని ట్రినిటీ ప్రైమరీ పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరం గోడపత్రికలను మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సన్ షైన్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాన్ని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 22తేదీ ఆదివారం రోజున ఉదయం10 గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమవుతుందని, ఈ శిబిరంలో మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రీషియన్, డెంటిస్ట్, ఎండి జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, ఆప్తమాలజిస్ట్, ఇతర రుగ్మతలకు సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్స్ పెద్దపల్లికి విచ్చేసి ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందన్నారు.

ఈ శిబిరంలో రాండమ్ బ్లడ్ షుగర్, బిపి, బ్లడ్ గ్రూపింగ్, ఈసీజీ, 2డి ఎకో ఉచితంగా పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సన్ షైన్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సురేష్, హెల్త్ క్యాంప్ ఆర్గనైజర్స్ ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ సయ్యద్ అజీజ్, లైసెట్టి బిక్షపతి, చొప్పరి వంశీ,ఎంపీపీలు, జడ్పిటిసిలు, చైర్మన్ లు, చైర్మన్ లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement