Thursday, February 22, 2024

Peddapalli: నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం.. ఎమ్మెల్యే దాసరి

నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం జూలపల్లి మండలం నాగులపల్లిలో నాగులపల్లి నుండి భూపాలపట్నం వరకు ఒక కోటి 60 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో నిర్మించ తలపెట్టిన రహదారి పనులను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ… గత పాలకులు రహదారుల నిర్మాణం మర్చిపోయారని, 9ఏళ్లలో అనేక రోడ్లను నిర్మించామన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందన్నారు. అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ రమాదేవి రాంగోపాల్ రెడ్డి, సర్పంచ్ వీరయ్య యాదవ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement