Sunday, February 25, 2024

TS: సీఎం పర్యటనకు భారీ బందోబస్తు.. సీపీ రెమా రాజేశ్వరి

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలియజేశారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ… మంగళవారం రామగుండం కమిషనరేట్ పరిధిలో మందమర్రి, మంథని, పెద్దపల్లి లలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఉంటాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐలు అనిల్, జగదీష్, సత్యనారాయణ, ఎస్ఐ మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement