Friday, May 17, 2024

29న పెద్దపల్లికి సీఎం రాక… కలెక్టరేట్ ప్రారంభోత్సవం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. నూతన కలెక్టరేట్ ను ప్రారంభించి జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుదేశించి మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏర్పాట్లను నిమగ్నమయ్యారు. బహిరంగ సభ కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ఏర్పాట్లు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement