Thursday, May 2, 2024

బీఆర్ఎస్ దేశంలో కీలక పాత్ర పోషించాలి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

భారత రాష్ట్ర సమితి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన గణపతి హోమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆది గణపతిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement