Sunday, June 30, 2024

మోదీ పాలనలో అన్ని కష్టాలే.. ఎమ్మెల్సీ కవిత

మోడీ పాలనలో దేశ ప్రజలందరూ కష్టపడుతున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం కోరుట్ల నియోజకవర్గస్థాయి తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. దేశంలోని బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో నిరుపేదలు మూడుపూటలా కడుపునిండా తినలేక పోతున్నారన్నారు. బీజేపీ చేసే మత రాజకీయాలకు తెలంగాణ ప్రజలు స్వస్తి పలకాలన్నారు. వాళ్లు జై శ్రీరామ్ అంటే మనం జై హనుమాన్ అందామని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement