Tuesday, October 8, 2024

KNR: బీజేపీకి షాక్.. గులాబీ గూటికి గడ్డం నాగరాజు..!

తిమ్మాపూర్, ప్రభ న్యూస్ : మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ మానంకొండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు కమలాన్ని వీడి కారెక్కనున్నారు. గతంలో రెండుసార్లు మానకొండూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాగరాజుకు ఈసారి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత 30ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కష్టపడిన తనను కాదని కొత్తగా చేరిన ఓ వ్యక్తికి టికెట్ కేటాయించడం పట్ల గడ్డం నాగరాజు గులాబీ గూటికీ చేరాలని నిర్ణయించుకున్నారు.

శనివారం ఉదయం రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీ.ఆర్.ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ.జీవి.రామకృష్ణా రావులను నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. త్వరలో భారీ సంఖ్యలో తమ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ దెబ్బతో మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అబ్బా అనే దుస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు సిద్ధం వేణు, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ లు రొడ్డ పృథ్విరాజ్, దేవా సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ నెల్లి మురళి, బీఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పిట్టల మధు, శాతరాజు యాదగిరి, నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, తదితరనాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement