Tuesday, October 8, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టి క‌న‌క‌దుర్గ‌మ్మ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గృహాలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి నటి కనకదుర్గమ్మ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించాలని, వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. మొక్కల వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని కనకదుర్గమ్మ అన్నారు. అనంతరం నటీమణులు రాగిణీ, నవీనారెడ్డి, నటుడు టార్జాన్ ల‌కు క‌న‌క‌దుర్గ‌మ్మ‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement