Tuesday, April 30, 2024

మహిళలకు కళ్యాణ లక్ష్మి ఒక వరం… మంత్రి మల్లారెడ్డి

ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ ఒక వరం అని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో సోమవారం మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి రెండు మున్సిపాలిటీల చైర్మన్ లు కౌకుట్ల చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, నరేందర్ రెడ్డి లు, కౌన్సిలర్ లు బీఅర్ఎస్ పార్టీ పట్టణాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement