Tuesday, May 28, 2024

TS | తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్యాం కోషీ.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు నుంచి రాక‌

హైదరాబాద్‌ , ఆంధ్రప్రభ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్యాంకోషీ బదలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. చత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్‌ కోషీ స్వచ్ఛందంగా మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు తప్ప ఎక్కడికైనా బదలీ చేయాలని స్వయంగా కొలీజియంను అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను మన్నించి తెలంగాణ హైకోర్టుకు బదలీ చేశారు. జస్టిస్‌ శ్యాం కోషీ 1967 ఏప్రిల్‌ 30 న మధ్యప్రదేశ్‌లో జన్మించారు.

జబల్‌పూర్‌ జీఎస్‌ కళాశాలలో డగ్రీ చదివారు. జబల్‌పూర్‌లోనే ఉన్న రాణిదుర్గావతి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని చదివారు. 1991మార్చి 9 న మధ్యప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2013 సెప్టెంబర్‌ 16 న చత్తీస్‌గఢ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 28మంది న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ కోషీ చేరితో జడ్జీల సంఖ్య 29 కి చేరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement