Friday, July 5, 2024

TS: సుందిళ్ల బ్యారేజీ మరమ్మతు పనులను పరిశీలించిన జస్టిస్ చంద్రఘోష్

తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బ్యారేజీల వైఫల్యాలపై విచారణ జరుపుతున్న ఆ కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్ ఇవాళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజీ (సుందిళ్ల)ని పరిశీలించారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అంతకు ముందు సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవాలయంలో చంద్రఘోష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు చంద్రఘోష్ శుక్రవారం రాత్రే పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో బస చేశారు. ఇవాళ బ్యారేజీల సందర్శనకు వెళ్లారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement